Saturday 12 November 2022

హర హర మహాదేవా

అభిషేకప్రియుని మాసమేతెంచెనని
అభిషేక ప్రియుని భక్తులు
ఆ ఆదిదేవునికి
అభిషేకమొనరింప
ఉదకమర్పించెనొకరు,
క్షీరమునర్పించెనొకరు,
పుష్పములనర్పించెనొకరు,
బిల్వపత్రంబులను నర్పించెనొకరు.........
            ఆ పరమశివుడు అనుగ్రహించు కాలమిదని
            శివనామము జపిస్తు కొందరు,
            శివపురాణం పఠిస్తు కొందరు,
            శివాలయములందు కొందరు,
            శివుడే సర్వశ్వం అనుచు కొందరు,
            తత్వములతో తన్మయత్వం పొందగ కొందరు,
            తన్మయత్వమై శివకీర్తనలతో ప్రార్ధించిరంద‌రు.....
ముక్తినొసగు కార్తీకమందు
ముక్తిని కోరి  నీ భక్తులు
భుక్తిచింతలేక
నక్తము ,ఉపవాసము ,
ఏకభక్తములను  ధీక్షలతో
చిత్తము నీకర్పించిన
భక్తులను బ్రోవగరావా
భక్తవశంకరా.............
                       (శంకరవాక్కు)

Monday 5 July 2021

గెలుపు మంత్రం

అలుపు నెరగనివాడు
గెలుపు నెరగడు
గెలుపు కోరువాడు
అలుపుకు తలొగ్గడు

     *****శంకరవాక్కు*****

Thursday 25 June 2020

ఆదర్శమూర్తి

తన మతం పర మతం
స్వజాతి పర జాతి
అన్న సంకుచిత భావనలతో
ఉన్న మానవజాతి
హితం కోసం
మహోపకారం
చేయ సంకల్పించి
సర్వ మత సభనే
వేదికగా చేసుకొని
మానవ మనుగడకు
అనర్ధ హేతువులైన
మత ఛాందసం
జాతి వైషమ్యాలను
త్యజీంచాలని
ఉధ్బోదించి
మూఢ అంధ విశ్వశాలను
విసర్జించిన నాడే
వసుధైక కుటుంబం
విరాజిల్లుతుందని
ప్రభోదించి
సర్వమత సహన్నాన్నే కాక
సర్వమతాలు సత్యాలన్నా
హిందూమత ఔనత్యాన్ని
వినంమ్రంగా విశ్వానికి
చాటి చెప్పిన ఆదర్శమూర్తి
స్వామి వివేకానందుడు...

Friday 17 January 2020

తన మతం
పర మతం
స్వ జాతి
పరజాతి
అన్న సంకుచిత భావనలు
జాతిమత విద్వేషలతో
జీవనం చేస్తున్న
మానవజాతి
హితంకోసం
మహోదయం
చేయ సంకల్పించి
సర్వమత సభనే
వేదికగా చేసుకొని
మానవ మనుగడకు
అనర్ధహేతువులైన
మతఛాందసం
జాతివైషమ్యాలను
త్యజించాలని
ఉద్భోదించి
అంధమూడ విశ్వాసాలను
విసర్జించిననాడే
వసుధైక కుటుంబం
విరాజిల్లుతుందని
ప్రభోదించి
సర్వమతసహనన్నే కాక
సర్వ మతాలు సత్యాలన్న
హిదూ మత ఔనత్యన్ని
వినంమ్రంగా విశ్వానికి
చాటిచెప్పిన
మహోన్నత వ్యక్తి
స్వామి వివేకానందుడు.....